ఏసుక్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలి
ఎమ్మెల్యే మట్టా రాగమయి.
అక్షర విజేత తల్లాడ:
తల్లాడ మండలంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే కార్యక్రమానికి సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ పాల్గొన్నారు. తల్లాడ మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ గుట్టమీద ఏర్పాటుచేసిన గుడ్ ఫ్రైడే ప్రార్థనలకు ఎమ్మెల్యే హాజరై ప్రార్థనలో పాల్గొని ఏసుక్రీస్తు యొక్క శ్రమలు గుడ్ ఫ్రైడే గురించి వివరించారు. అనంతరం తల్లాడ గ్రామంలో హాస్యం చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే లో పాల్గొని సిలువ మోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసు క్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలని ఏసు రక్తంతో పాపములు కలుగును ఏసు క్రీస్తు గురించి పలు వాక్యాలు తెలియజేశారు. మండల ప్రజలకు ముందుగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు, వాక్యోపదేశకులు, మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.