* చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం
* భీమ్ భరత్ ఆధ్వర్యంలో నవాబుపేట్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
* ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
* నవాబ్ పెట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని నవాబుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నవాబుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ ఆధ్వర్యంలో నవాబ్ పెట్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 10 లక్షల ఉచిత వైద్య సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా 6గ్యారంటీలను అమలు తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఏది ఏమైనా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఫామేన భీమ్ భరత్ ఆధ్వర్యంలో నవాబుపేట్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. నవాబ్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలమందిరం కలిసి నవాబుపేట్ మండలం తరపున చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి భారీ మెజారిటీ ఇస్తామని అన్నారు.