అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
అక్షర విజేత, రాయికల్:
గంజాయిని అక్రమంగా తరలిస్తూ , విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేశామని జగిత్యాల డిఎస్పి రఘు చందర్ తెలిపారు. జగిత్యాల జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పి) సన్ ప్రీత్ సింగ్ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు జగిత్యాల డి.ఎస్.పి రఘుచందర్, రూరల్ సీ.ఐ. ఆరీఫ్ అలీ ఖాన్, రాయికల్ ఎస్సై అజయ్ గౌడ్ తో కలిసి రాయికల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలిపిన వివరాలు ప్రకారం
గురువారం రోజున సాయంత్రం 4.00 గంటలకు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ పర్యవేక్షణలో రూరల్ సి.ఐ ఆరిఫ్ అలీఖాన్ మరియు రాయికల్ ఎస్సై అజయ్ గౌడ్ సిబ్బంది రాయికల్ శివారు లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు స్కూటీ పైన రాయికల్ వైపు జగిత్యాల నుండి వస్తుండగా, కుమ్మరిపల్లి బస్టాండ్ వద్ద ఆ వ్యక్తుల వాహనాన్ని తనిఖీ చేస్తుండగా నిందితుల వద్ద గల సంచి లో 1.5 కిలోల ఎండు గంజాయి దొరికింది. నిందితుల వద్ద నుండి గంజాయి, సెల్ ఫోన్ లు మరియు స్కూటిని స్వాధీన పరచుకొని విచారించగా నేరం రుజువు కావటం చేత వెంటనే నిందితులను అరెస్టు చేశామన్నారు.
A1గా కొండూరి రాజేష్, తండ్రి రవి, వయస్సు 26 , ఓ సి సి: డ్రైవర్, ఆర్ ఎన్ టి నగర్, జగిత్యాలకు చెందిన వ్యక్తి, మరో వ్యక్తి A2గా అరుముల్ల సాయి కుమార్, తండ్రి గంగాధర్, వయస్సు 23 సం: మత్స్యకారుడు బీట్ బజార్, జగిత్యాల, జగిత్యాల కు చెందిన వ్యక్తులుగా, ఒకరు సీసీఎల్ గతంలో వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి, దొంగతనాల కేసులు ఉన్నాయని,ఇటీవల రాయికల్ గంజాయి కేసులో రిమాండు అయిన పెనుగొండ గణేష్, మలవాత్ సతీష్ మరియు జగిత్యాల పట్టణానికి చెందిన కొండూరి రాజేష్. అరుముల్ల సాయి కుమార్ మరి కొంత మంది వ్యక్తులు ఒక గ్రూపు గా ఏర్పడి సిసిఎల్ దగ్గరికి వెళ్లి తక్కువ ధర కు గంజాయి ని కొనుక్కొని, జగిత్యాల జిల్లా కు తీసుకు వచ్చి, ఇక్కడ అమాయక యువత కు ఎక్కువ ధరకు అమ్మతున్నారు. వీరు అందరూ గత 2, 3 సం .ల లో చాలా సార్లు సిసిఎల్ దగ్గర తక్కువ ధర కు గంజాయి ని కొనుక్కొని వచ్చారు. సిసిఎల్ ను జగిత్యాల కి తీసుకు వచ్చి గంజాయి ని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని, ఈ నెల 25 న తన ప్రాంతం నుండి జగిత్యాల కి బయలు దేరాడు. అతను జగిత్యాల కి వచ్చి తన పాత మిత్రులు అయిన రాజేష్, సాయి కుమార్ లను కలుసుకుని, ఈ రోజు రాజేష్ యొక్క బండి మీద రాయికల్ లో ఎవరైనా వ్యక్తులకు అమ్ముదాం అని ముగ్గురు రాయికల్ బయలుదేరగా, వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు నిందితులను, సీసీఎల్ ను పట్టుకున్నారు. ఈ కేసులో గంజాయి కొనుగోలు మరియు సరఫరా చేసిన వ్యక్తుల గురించి దర్యాప్తు జరుగుతుందని జగిత్యాలడిఎస్పి రఘు చందర్ తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా చేస్తూ విక్రయిస్తున్న నిందితులను చాక చక్యంగా పట్టుకున్న రూరల్ సి.ఐ.ఆరీఫ్ అలీ ఖాన్ రాయికల్ ఎస్సై అజయ్ గౌడ్, కానిస్టేబుల్స్ సాగర్, ప్రశాంత్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.