*బిజెపి లో భారీ చేరికలు.*
బిజెపి లో చేరిన మాజీ సర్పంచ్లు
బిజెపి లో కొత్త జోష్
బీబీ పాటిల్ గెలుపే లక్ష్యం గా కదం తొక్కిన కార్యకర్తలు
భాజపా అభ్యర్థికి రుద్రూర్లో ఘన స్వాగతం
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
జహీరాబాద్ బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ కు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది. బిజెపి లో చేరికలు పార్టీ క్యాడర్ లో జోష్ నింపింది. బీబీ పాటిల్ గెలుపే లక్ష్యంగా బాజపా కార్యకర్తలు కదం తొక్కుతున్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని, పోతంగల్, కోటగిరి, రుద్రుర్,మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రుద్రూర్ లో జరిగింది. ఈ కార్యక్రమంకు ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ కు చెందిన 50 మంది కార్యకర్తలు , మాజీ సర్పంచ్ లు బీబీ పాటిల్ సమక్షంలో బిజెపి లో చేరారు.. భాజపా అభ్యర్థిగా మొట్టమొదటిసారి గా ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీబీ పటేల్ కు భాజపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. జహీరాబాద్ ఎంపీ గా భారీ మెజారిటీ తో గెలిపించి మోడీ కీ బహిమతిగా ఇద్దామని పేర్కొన్నరు. ఎంపీ గా కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ నియోజకవర్గం లో చేపట్టిన అభివృద్ధి పనులు, అదేవిధంగా మోడీ ఈ దేశం అభివృద్ధి కీ చేసిన కృషిని ప్రతీ కార్యకర్త గడుప గడుప కు ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
జహీరాబాద్ ఎన్నికల ఇంచార్జి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకరమణ రెడ్డి ,బిజెపి జిల్లా అధ్యక్షులు అరుణ తార, ప్రబారి మహిపాల్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు