అక్షర విజేత సిద్దిపేట్
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్. మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బంది ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వహించాలని సూచించారు.(విపిఓ) విలేజ్ పోలీస్ ఆఫీసర్లకు అందరికీ బుక్స్ ఇవ్వడం జరిగింది. వారం రోజులలో సంబంధిత గ్రామాలకు చెందిన సమాచారాన్ని బుక్స్ లో పొందుపరచాలని తెలిపారు.
రెండు మూడు రోజులకు ఒకసారి గ్రామాలను సందర్శించాలని గ్రామాలలో ఏం జరుగుతుంది అనే సమాచారాన్ని సేకరించాలని గ్రామంలో ఉన్న పెద్దలు యువకులతో కలిసి వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని ఏదైనా సమాచారం ఉంటే వాట్సప్ గ్రూపులలో పంపించాలని సూచించారు.
ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలని తెలిపారు.
పోలీస్ అధికారులు సిబ్బంది ఒక కుటుంబం గా సమిష్టిగా విధులు నిర్వహించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచుకోవాలని సూచించారు.
ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండే విధులు నిర్వహించాలని సూచించారు.గంజాయి ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సంబంధిత విపిఓ ప్రత్యేక ఇన్ఫర్మేషన్ వ్యవస్థను రూపొందించుకోవాలని తెలిపారు. ఇసుక, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా అరికట్టాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల వేల ప్రజల్లో నమ్మకాన్ని దైర్యాన్ని కలిగించడంలో ముఖ్యమైన పాత్రని వహించాలి ఫ్రీ అండ్ ఫేర్ గా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలి.ఎన్నికల సందర్భంగా పోలీస్ సిబ్బంది చేయాల్సిన మరియు చేయకూడని విధుల గురించి వివరించారు. క్రిటికల్, నార్మల్ గ్రామాల గురించి, మరియు ట్రబుల్ మంగర్స్, పాత నేరస్తుల గురించి మరియు గత ఎన్నికలలో నేరాలు చేసిన వ్యక్తుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపినారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సమయంలో గోడవలను సృష్టించే వ్యక్తులను గుర్తించాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఏవరైనా పాల్పడితె వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్లను మభ్యపెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలన్నారు.