లక్కీ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం
* యువత స్వయం ఉపాధి పై దృష్టి సాధించాలి.
* మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు
అక్షర విజేత మరిపెడ
మరిపెడ మున్సిపాలిటీలో గురువారం నూతన లక్కీ గ్రాండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం జరిగింది. యువత స్వయం ఉపాధి మార్గాల పై దృష్టి సారించాలనీ గుడిపూడి నవీన్ రావు అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని వరంగల్ జాతీయ రహదారి పక్కన సెయింట్ అగస్టిన్ స్కూల్ ఎదురుగా మండలంలోని పెసర దినేష్ రెడ్డి, ఉల్లి శ్రీనివాస్, ఆధ్వర్యంలో ‘ లక్కీ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డితో కలిసి రఘువీరారెడ్డి మున్సిపల్ చైర్మన్ సింధూర రవి కుమార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో యువత కొత్త మార్గాల వైపు పయనిస్తున్నారని అందులో భాగంగా రెస్టారెంట్ ని ఎంపిక చేసుకొని దానిలో కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ జీవితంలో ముందుకు సాగాలని, నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసంఎదురు చూడకుండా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పలువురికి ఉపాధి కల్పించడంతోపాటు సమాజంలో ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుగులోతు రవి నాయక్, ఐలమల్లు, గుండ గాని వెంకన్న, అఫ్జల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.