హైటెక్ పేపర్ కంపెనీ మహిళా వర్కర్ల ధర్నా
శ్రమ దోపిడీకి గురవుతున్న మహిళా వర్కర్లు
కార్మిక చట్టాలు అమలు పరచడంలో అధికారుల అలసత్వం
అక్షర విజేత సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
హత్నూర మండల పరిధిలోని చింతల్ చెరు గ్రామ శివారులో గల హైటెక్ పేపర్ కంపెని ముందు మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం నాడు మహిళా కార్మికులు తమకు కార్మిక చట్టాల ప్రకారం వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించడం లేదని కంపెనీ యాజమాన్యం పై తిరుగు బాటు చేశారు. కంపెనీ మెయిన్ గేట్ ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్న గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ చట్టాలను తుంగలో తొక్కి తమ శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. 8 గంటలకు బదులు 10 గంటలు మహిళలు అని చూడకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆవేదన చెందారు. కంపెనీలో పని చేసే ఏ ఒక్కరికి కూడా పిఎఫ్,ఈఎసై ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు ఏమి లేవని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి కంపెనీ కార్యక్రమాలు జరుతున్న కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ప్రతి నెల సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. మహిళా కార్మికులకు సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో కాని, తమకు కాని ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే ఈ కంపెనీలో పనిచేయడం వల్ల రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కార్మికులు ఆందోళన చేస్తు కొన్ని డిమాండ్లు యాజమాన్యం ముందు ఉంచారు. పిఎఫ్, ఈఎస్ఐ లేదా ఇన్సూరెన్స్ సౌకర్యం కుటుంభంతో సహా కల్పించాలి. 8 గంటలు పని గంటలు ఉండే విదంగా చర్యలు చేపట్టాలి. కనీస వేతనం 26 వేలు ఉండే విదంగా చూడాలి. అదనపు పనికి ఓటి వేతనం ఇవ్వాలి. కార్మిక చట్టాలను అమలు పర్చాలని డిమాండ్ చేశారు.