కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా షేక్ అలీమ్ నియామకం…
-నియామక పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదేం వీరన్న…
అక్షర విజేత/ ఉమ్మడి ఖమ్మం బ్యూరో
భద్రాచలం పట్టణం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షేక్ అలిము ను నియమిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదేం వీరయ్య నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచల పట్టణ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు అలిమ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పజెప్పిన మన్యం టైగర్ ఆదివాసి ముద్దుబిడ్డ పోధేం వీరయ్య కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా వీరన్న నాయకత్వంలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నా బాధ్యతను సమర్థవంతంగా అందరి సహకారంతో నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మరియు డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు..