రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి సహకరించాలి
అక్షర విజేత, మోర్తాడ్
ఏరుగట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో గల సహకార సంఘం ఫంక్షన్ హాల్ భవనంలో 65వ వార్షికోత్సవ మహాజన సమావేశం గురువారం తాళ్లరాంపూర్ సొసైటీ అధ్యక్షులు పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సొసైటీ కార్యదర్శి జమ ఖర్చులు, సమావేశంలో సభ్యులకు రైతులకు చదివి వినిపించారు. అంతేకాకుండా చేపట్టే పనులపై, రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలపై, పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా తాళ్లరాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్ద కాపు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు సొసైటీ ద్వారా, బ్యాంకుల ద్వారా తీసుకున్న సామాజిక, దీర్ఘకాలిక, రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి సహకరించాలని రైతులను కోరారు. నూతన ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర సైతం కల్పిస్తుందని, రైతులు సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొనుగోలు కేంద్రాలకు పూర్తిస్థాయి ఆరబెట్టిన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలన్నారు. దళారులకు ధాన్యాన్ని విక్రయించి నష్ట పోవద్దని రైతులకు సూచించారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ కొట్టాల శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు దేవా రెడ్డి, ఆడెం గంగ ప్రసాద్, బడగిరి సాయిలు, వెళ్ళయ్యా గారి రవి, బద్దం రవీందర్, దిశ బోయిన సంజీవ్, సొసైటీ కార్యదర్శి, సొసైటీ సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.