పర్మిషన్ లేకుండా అడ్మిషన్లకు పాల్పడుతున్న పాఠశాల పై చర్యలు తీసుకోవాలి
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
నిజామబాద్ జిల్లాలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొత్త భవనాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ప్రచారాలు నిర్వహిస్తూ అడ్మిషన్లకు పాల్పడుతున హెచ్పిఎస్, ప్రెసిడెన్సి కిడ్స్ క్యాంపస్, విక్టర్ ఎక్స్లెన్సీ స్కూల్, నిషిత స్కూల్ లపై చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (ఏఐపిఎస్యు) ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి జ్వాల,జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడతో నిజాంబాద్ నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలను అడ్డాగా చేసుకొని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారాలు నిర్వహిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లకు పాల్పడడం జరుగుతుంది అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి గతంలో అనేకసార్లు పర్మిషన్ లేకుండా అడ్మిషన్ల నిర్వహించవద్దని హెచ్చరించినా, పెడచెవిన పెడుతూ మా స్కూల్లో – మా ఇష్టం అంటూ కనీసం నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా విద్యార్థుల తల్లిదండ్రులను ఇంటర్నేషనల్, ఎక్స్లెన్సీలు రకరకాల తోక పేర్లు పెట్టి మాయా లోకాన్ని సృష్టించినట్టు హంగులు హార్భాటాలలో కూడిన బిల్డింగ్ వాతావరణాన్ని మేము కల్పిస్తున్నామని బిల్డింగ్ నమూనాలు చూయిస్తూ నిర్మాణాదశలో ఉన్నటువంటి బిల్డింగులు చూయిస్తూ అడ్మిషన్లకు పాల్పడడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, వెంటనే స్పందించి విద్యార్థుల తల్లిదండ్రులను రకరకాల పేర్లతో మోసాలకు పాల్పడుతున్న పాఠశాల పై చర్యలు తీసుకొని వాటిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు