ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి
అక్షర విజేత,మంచిర్యాల ప్రతినిధి
బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని మందమర్రి, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారికి రానున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల వారు పోలీస్ వారికి సహకరించాలని, ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అనవసరంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టి , రాజకీయ పార్టీల మధ్య గొడవలు పెట్టే వారి పైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. అనంతరం మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో మందమర్రి, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కొన్ని సంఘటనలు ఉదాహరిస్తూ, మళ్లీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రచారంలో అనుమతి తీసుకోనుట, సువిధ, సి విజిల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మందమర్రి తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ కమిషనర్, మందమర్రి, రామకృష్ణాపూర్ ఎస్సైలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.