ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి
మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు కట్టపైన పోచమ్మ గుడి పక్కన ఉన్న విద్యుత్ స్తంభం ఒక వైపు వంగి పోయి ప్రమాదకరంగా మారిందని రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య అన్నారు. ఈ విద్యుత్ స్తంభం నుండి పోచమ్మ గుడికి, బోరు బావికి కట్టపైన వాకింగ్ ట్రాక్ కు సరఫరా అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉన్నదని, ఎలాంటి ప్రమాదం జరుగక ముందే వంగి ఉన్న స్తంభం స్థానంలో కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను వాకర్స్ సభ్యులు కోరారు.