కమనీయం రమణీయం వేములవాడ రాజన్న ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవం”

అక్షర విజేత వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం అంగరంగా వైభవంగా కన్నుల పండువగా జరిగింది. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతి దేవి అమ్మవారిని మేళతాళలలో చైర్మన్ చాంబర్ ముందు ఏర్పాటుచేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద వరకు ఎదుర్కొన్నారు. వరుడు తరుపున ఆలయ ఈఓ వధువు తరుపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా, వరకట్నంగా 551 కోట్లు చెల్లిస్తామన్నారు. కన్యదాతలుగా అప్పల బీమా శంకర్ శర్మ ఇందిర లు వ్యవహరించారు. అంతకుముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ స్థాన చార్యులు అప్పాల భీమా శంకర్ శర్మ అధ్వర్యంలో అభిజిత్ లగ్న మూహుర్తమున ఉదయం 10 .55 నిమిషాల నుండి 12.05 నిమిషాల వరకు వేద మంత్రోచ్చారల తో శ్రీ స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిపించారు. మరో వైపు శ్రీ స్వామి వారి కళ్యాణం జరుగుతుండగా శివ పార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకోని శివుడిని పెళ్లాడినట్లు స్మరించుకున్నారు.
శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణ మహోత్సవం కు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరుపున ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుండి మేళా తాళల మధ్య ఆలయంకు చేరుకుని స్వామి వారల కళ్యాణంకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ర్టం నలుమూలల నుండి వేలాది గా భక్తులు శివపార్వుతులు తరలివచ్చారు. దీంతో రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు అసక్తిగా తిలకించారు. ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివ పార్వతులు చేతి లో త్రిశూలను కదలిస్తూ, ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు.