ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి విజయం ఖాయం సరిత

జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ
అక్షర విజేత గద్వాల బ్యూరో:
గద్వాల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ మరియు మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ తో కలిసి కౌన్సిలర్లు,ఎంపిటిసిలు జెడ్పి కార్యాలయం సమావేశం మందిరంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం మీడియాతో సరితమ్మ మాట్లాడుతూ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని సరితమ్మ అన్నారు.
జెడ్పి చైర్ పర్సన్ వెంట కౌన్సిలర్లు,ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.