సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ సేవ కేంద్రం ఏర్పాటు
అక్షరవిజేత మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కోర్టులో ఈ సేవా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చే వర్చువల్ విధానం ద్వారా సాయంత్రం5-45 నిమిషాలకు ప్రారంభోత్సవం చేసి
ఆయన మాట్లాడారు.ఈ-సేవా కేంద్రంద్వారా కేసు యొక్క స్థితిగతులు,కేసుకు సంబంధించిన పూర్తి సమాచార వివరాలను సర్టిఫై కాపీలను పొందవచ్చని,న్యాయవ్యవస్థలోని 12రకాల పౌర సేవలను అత్యంత వేగంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్,సీనియర్ సివిల్ జడ్జి సురేష్,ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కె మౌనిక,అదనపు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి,బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డి వెంకటస్వామి,ప్రభుత్వా న్యాయవాది కొంపెల్లి వెంకటయ్య,పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్లు,సీనియర్ న్యాయవాదులు సురేష్ రెడ్డి,రవికుమార్,నగేష్ ,స్పెషల్ ఫోక్సో కోర్టు పిపి పద్మాకర్ రెడ్డి,ఏజిపి ఆనంద్ కుమార్ కోర్టు సిబ్బంది మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.