జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ సుధారాణి
అక్షర విజేత, తాండూర్
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో త్రాగునీరు పై ప్రత్యేక దృష్టించాలని జిల్లా పంచాయతీ అధికారిణి అధికారి డిపిఓ సుధారాణి పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు.
బుధవారం తాండూరు మండలం బెల్కటుర్, కరణ్ కోట్ గ్రామాలలో ఆమె పర్యటించారు ముందుగా బెల్కటుర్ గ్రామంలో ఉన్న స్మశాన వాటిక వద్ద ఉన్న బోరు మోటర్ మరమ్మత్తులు వేయించాలని కార్యదర్శి పార్వతమ్మను,ఆదేశించారు అదేవిధంగా గ్రామంలో అక్కడక్కడ నీటి కులాయి వద్ద ఆన్ ఆఫ్ సిస్టలను ఏర్పాటు చేయాలన్నారు తాగునీరు వృధా చేయవద్దని హెచ్చరించారు గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ టాక్స్ 6, లక్షలు కట్టవలసిన ఉన్న కేవలం 1, లక్ష మాత్రమే టాక్స్ కట్టడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కరణ్ కోట్ గ్రామాలలో డిపిఓ సుధారాణి పర్యటించారు గ్రామంలో 5 వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ వడ్డెర బస్తీలో ఉన్న వాటర్ ట్యాంకు పైప్ లైన్ కలెక్షన్ లేకపోవడంతో తాగునీటి కి ఇబ్బందులు పడుతున్నారని నివాసులు వాపోతున్నారు సమస్యను. పరిష్కరించాలని కార్యదర్శి ఆనందరావు కు డిపిఓ సూచించారు.
ఇంటి పన్ను వసూలు100 శాతం పూర్తి చేయాలని జిల్లాలోనే మేజర్ గ్రామపంచాయతీ కరణ్ కోట్ గ్రామంలో సమస్యలను లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఏపీఓ రథన్ సింగ్, మిషన్ భగీరథ ఏ డి ప్రతిభ, ఏంపీఓ సర్వతం రెడ్డి,నాయకులు రాజ్ కుమార్, శరణం బసప్ప ఇతరులు ఉన్నారు