మహిళను నమ్మించి హత్య చేసిన దొంగ బాబా
జిన్నారం సీఐ వి. సుధీర్ కుమార్
అక్షర విజేత సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
మూఢ నమ్మకాలను నమ్మినందుకు ఒక మహిళ తన ప్రాణాన్నే కోల్పోయింది. పూజలు చేస్తానని నమ్మించి, మహిళను హత్యచేసి, బంగారం తొ ఉడాయించిన దొంగస్వామీజీని గుమ్మడిదల పోలీసులు కేసు ఛేదించి 4.3 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఇట్టి కేసు వివరాలు జిన్నారం సిఐ వి.సుధీర్ కుమార్ విలేకరుల ముందు ఉంచారు. వీరన్నగూడం గ్రామంలో గల వీరభద్ర స్వామి ఆలయం వద్ద టి షాప్ నడుపుకుంటూ జీవనం సాగించే మృతురాలు బుచమ్మ (60) ను గతనెల 13 వ తేదీన ఉదయం నిందితుడు శివ తనకు పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించి ఆమెను సికింద్రాబాద్ తీసుకెల్లాడన్నారు. అక్కడ పూజకు అవసరమైన సామాన్లు కొనుగోలు చేసి అటు నుండి ఘట్కేసర్ పరిదిలోని మాదారం గ్రామా శివారులోకి నిర్మానుష ప్రాంతములోని తీసుకెల్లాడన్నారు. గుమ్మడికాయ, నిమ్మకాయలు, పసుపు కుంకుమలు వేసి పూజలు చేస్తూ, ఆమె మేడలో బంగారు గోలుసు తీయమని అనగా ఆమె తీయకపోయేసరికి నిందితుడు ఆగ్రహంతో ఆమె మేడలో నుండి బలవంతంగా బంగారు ఆభరణాలు తీసుకునే క్రమంలో ఆమె అడ్డగించడంతో ఆమెను క్రింద పడవేసి బండ రాయితో తలపై బలంగా కొట్టి చంపాడన్నారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆమె మేడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని పారిపోయాడన్నారు. నిందుతుడు గ్రామం వెంకిర్యాల, బిబి నగర్ మండలం, యదాద్రి బోనగిరి జిల్లా కి చెందిన శివ గుడిల వద్ద బొట్టుపెట్టి పొట్టపోసుకునేవాడన్నారు. ఇంతకుముందు కూడా దొంగస్వామీజీ అవతారం ఎత్తి పలువురిని మోసం చేశాదన్నారు. ఇతని మీద హన్మకొండ, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా పలు కేసులు ఉన్నట్లు సమాచారం. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
నకలీ పూజారులు, దొంగ స్వామీజిలను నమ్మవద్దు అని అన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇట్టి కేసు చేదనలో చాకచక్యంగా వ్యవహరించి, నిందితుడిని పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ తొ పాటు సిఐ అబినందించారు. కేసు ఛేదించి నిద్దితుణ్ణి పట్టుకున్న వారిలో మహేశ్వర్ రెడ్డి ఎసైపి, గుమ్మడిదల పోలీస్ స్టేషన్, పర్వేజ్ ఏఎసై, వెంకటేశం , కిషోర్ , సికిందర్ లు ఉన్నారు.