వానర సైన్యం మాదిరిగా కదలి రావాలి
బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్
అచ్చంపేట వానరసైన్యం మాదిరిగా కదలి రావాలని నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంటు అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు.అచ్చంపేట మండల కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భారత్ ప్రసాద్ మాట్లాడుతూ. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో నా విజయాన్ని ప్రతి ఒక్కరు సైనికులుగా పని చేయాలని బిజెపి పార్టీని గెలిపించాలని ప్రధాన నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి. ఆశీర్వదించమని కోరారని తెలియజేశారు.బిజెపి జెండా అనేది బీద ప్రజలకు అండగా ఉంటుందని బిద కుటుంబాల పిల్లల భవిష్యత్ కు నాందిఅని ప్రపంచంలో భారత దేశంలో అగ్రగామి దేశం కావడానికి ముఖ్యమని తెలిపారు. కేంద్రంలో వచ్చేది మళ్ళీ బిజెపి ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ప్రత్యేకంగా వివరించాలన్నారు.మన భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ని ప్రతి గ్రామంలో రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తుందన్నారు మరియు పేదవారికి ఫ్రీ టాయిలెట్స్ ఇవ్వని ప్రతి ఇంటికి ప్రతి గడపకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి తెలుపాలని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు అల్లని సుధాకర్. ఎంపీ రాములు, బీసీ కమిషన్ ఆచారి, మండగారి బాలాజీ, బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తల పెద్ద ఎత్తున పాల్గొన్నారు