పాత ప్రభుత్వ ఆసుపత్రి కూల్చడానికి టెండర్ల వేలంపాట
-ఎన్ని మంది సభ్యులు టెండర్ల వేలంపాటలో హాజరు.
పాత ప్రభుత్వ ఆసుపత్రి టెండర్- “షేక్ హంజద్ కైవసం”
అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి
ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏరియా ఆసుపత్రి నిర్మించడానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.కావున ప్రస్తుతం వాడుకలో ఉన్న ఆసుపత్రి ఆవరణలో కొత్త ఆసుపత్రి నిర్మించడానికి పాత భవనం కూల్చివేయడానికి టెండర్ 15.3.2024 న పేపర్ లో ప్రకటించడం జరిగింది.ఈ టెండర్ కు పదిమంది వరకు డిడిలు కట్టగా తేదీ.27.3.2024 నాడు 12 గంటలకు వేలం పాటలో డబ్బులు ఎవరు ఎక్కువ పలికితే వారికి ఈ భవనాన్ని కూల్చడానికి కాంట్రాక్టు ఇవ్వడం జరుగుతుంది. ఈ వేలం పాటకు 8 ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు. ఇందులో ఎస్.ఏ ట్రేడర్స్ అండ్ డిమాలేషన్ ఓనర్ షేక్ హంజధ్ అనే కాంట్రాక్టర్ 2 లక్షల రెండు వేలకు భవనాన్ని కూల్చి ఇవ్వడానికి పాట ఈ టెండర్ ను కైవసం చేసుకున్నారు. ఈ భవనంలో ఉన్న తలుపులు, మెటీరియల్ అంతా తాను తీసుకొని కూల్చి, ఖాళీ స్థలాన్ని అందిస్తారని సూపరిండెంట్ డాక్టర్ శివశంకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శివశంకర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్, ఆప్తల్ మిక్ ఆఫీసర్ హరినాథ్ నెహ్రూ, ఫార్మసిస్ట్ నారాయణ, కృష్ణ, జూనియర్ అసిస్టెంట్లు సునీల్ కుమార్ ,విక్రమ్, సాయిరాం, ఆసుపత్రి సిబ్బంది వాజీద్,శ్రీనివాస్, సంతోష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.