ఆస్తి వివాదం నిండు ప్రాణాన్ని బలిగొంది
అక్షరవిజేత,టేక్మాల్
ఆస్తివివాదం నిండు ప్రాణాన్ని బలిగోంది ఆస్తికోసం అత్తను హతమార్చాలనుకున్నాడు పథకం ప్రకారం అత్తను హతమార్చాడు.పోలీసుల కథనం ప్రకారం తంపులూరు గ్రామంలో సంగమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది తలకు బలమైన గాయాలు కావడం పోలీసులు అన్ని కోణాలో దర్యాప్తు జరిపటంతో చివరికి సంగమ్మ హత్యోదంతం మిస్టరి వీడింది వట్టిపల్లి మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన యేసు ఈనెల 21న సంగమ్మ ఇంటికి వచ్చి భూమి వివాద విషయంలో జోగిపేటలో లాయర్ వద్దకు తీసుకెళ్లాడు అదే రోజు తిరిగి ఇంటికి తంప్లూర్ గ్రామానికి బైక్ పై చేరుకున్నాడు రాత్రి అక్కడే ఉన్న యేసు రాత్రి సమయంలో నిద్రిస్తున్న సంగమ్మను తలపై సుత్తితో రెండు సార్లు బలంగా కొట్టడంతో సంగమ్మ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు ఇతర విలువైన ఆస్తి పత్రాలు తీసుకొని యేసు పరారయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అల్లాదుర్గ సిఐ రేణుక, టేక్మాల్ ఎస్సై మురళి అన్ని కోణాల్లో దర్యాప్తును జరపడంతో మిస్టరీ వీడింది అనంతరం బుధవారం నాడు నిందుతుడిని రిమాండ్ చేశారు.సంగమ్మ కు ఒక కుమారుడు ఉన్నాడు