అంజన్న హుండీ లెక్కింపు 1 కోటి 11 లక్షలు
అక్షర విజేత మల్యాల కొండగట్టు
మల్యాల మండలం ముత్యంపేట గ్రామం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామికి భక్తులు భక్తితో చెల్లించిన కానుకలను అధికారుల సమక్షంలో రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు 27 వ తేదీ బుధవారం రోజున 48 రోజులవి 12 హుండీలు విప్పి లెక్కించగా 1,11,07,329 రూ నగదు,74 గ్రాముల మిశ్రమ బంగారం,5 కిలో 500 గ్రాముల మిశ్రమ వెండి,40 విదేశీ కరెన్సీ నోట్లను వచ్చినట్లుగా తెలిపారు.కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, జి సంజీవరెడ్డి ఉప కమిషనర్ దేవాదాయ శాఖ వరంగల్,ఏఈఓ అంజయ్య,సూపరిండెంట్లు శ్రీనివాస్ శర్మ,సునీల్,ఎఎస్సై శ్రీనివాస్,రమణారెడ్డి ఆలయ సిబ్బంది రాజరాజేశ్వర సేవ సమితి సభ్యులు మరియు హోంగార్డ్స్ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు