కౌకుంట్ల మండల బిజెపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక
అక్షర విజేత దేవరకద్ర
కౌకుంట్ల మండలంలో బిజెపి పార్టీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దేవరకద్ర అసెంబ్లీ కన్వీనర్ గా కురువ రమేష్, కౌకుంట్ల బిజెపి పార్టీ మండల ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, అధ్యక్షతన కౌకుంట్ల మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి రామారాజు, అనిల్ కుమార్ యాదవ్. బీజేవైఎం మండల అధ్యక్షులుగా గుమ్మడాల రాఘవేందర్ గౌడ్ ని నియమించారు. అదేవిధంగా వివిధ మౌర్చలా అధ్యక్షులను కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అసెంబ్లీ ఇన్చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి నూతనంగా ఎన్నుకోబడిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపి, ప్రతి ఒక్కరూ బిజెపి పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పని చేయాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కౌకుంట్ల నూతన కమిటీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.