పెండింగ్ వేతనాలకై ఏప్రిల్ 1 నుండి ఆసుపత్రి కార్మికుల నిరవధిక సమ్మె……
– ఆసుపత్రి కార్మికుల ఆకలి గోసా పట్టదా..?
పి.సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి….
అక్షర విజేత, మరికల్/ ధన్వాడ:
నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికుల ఆందోళన.
సమ్మె నోటిసు అందజేత.. ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ పరిదిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల ఆకలి గోస వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వానికి పట్టదా అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ , ఎఐటియుసి నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న లు ద్వజమెత్తారు.
బుధవారం నాడు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనరేట్ పరిధిలోని నారాయణ జిల్లా ఆసుపత్రి, మక్తల్,కోస్గి, మద్దూర్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్ర ఆస్పత్రుల పారిశుద్ధ్య సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు చెల్లించాల్సిన ఐదు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా ఆస్పత్రి ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.
అనంతరం వేతనాల చెల్లింపులో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1 వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆసుపత్రి కార్మికుల నిరవధిక సమ్మె డిమాండ్ నోటీసులను ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ మరియు డిసిహెచ్ఎస్ కార్యాలయ ఏఓ కి అందజేశారు.ఈ సందర్భంగా జరిగిన ఆందోళనలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ ఏఐటియుసి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న లు మాట్లాడుతూ:-…
వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల కార్మికులకు సకాలంలో వేతనాలు అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , ప్రభుత్వమూ తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనిని ఆవేదన వ్యక్తం చేశారు,కార్మికులకు దాదాపు ఎనిమిది నెలల నుండి వేతనాల బడ్జెట్ ను ప్రభుత్వం విడుదల చేయడంలేదని అన్నారు. కార్మికులు ఏజెన్సీల కాంట్రాక్టర్లను వేతనాలు చెల్లించాలని అడిగుతుంటే ప్రభుత్వము నుండి 8 నెలలుగా బడ్జెట్ రావడం లేదని అయినా మేము మూడు నెలల వరకు వేతనాలు ఇచ్చామని మిగతా 5 నెలల వేతనాలు మేము చెల్లించలేమని చేతులెత్తేసారని దీనితో కార్మికులు నెలవారి మహిళా సంఘాల పొదుపులు, ఈఎంఐ, పిల్లల ఫీజులు కట్టలేక తీవ్రమైన అవమానాలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యవసర వైద్య విభాగాల్లో పని చేసే సిబ్బందికి వేతనాల ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈనెల 31 వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని , లేకపోతే ఏప్రిల్ ఒకటి నుండి సమ్మె తప్పదని. ఈ సమ్మె తో కార్మికులకు ఎలాంటి బాధ్యత లేదని వారు అన్నారు.ప్రభుత్వం మానవతా దృక్పథంతో పెండింగ్ వేతనాలు చెల్లించి కార్మికుల సమ్మెను విరమింప జేసేందుకు ప్రత్యేక కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
రోగుల మలమూత్రాలు ఎత్తిపోస్తు వెలకట్టలేని సేవలు చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పట్ల చిన్న చూపు చూడడం తగ్గదని అన్నారు.
అర కొర చెల్లించే వేతనాలు కూడా సకాలంలో చెల్లించకపోతే కార్మికుల జీవనం గడిచేది ఎలా అని ఏఐటియుసి ప్రశ్నిస్తుందన్నారు. వేతనాలు రాక కార్మికులు అప్పుల ఊబిలో కూరుకు పోయారని అన్నారు.
ఈ ఆందోళనా కార్యక్రమంలో ఆస్పత్రుల కార్మికులు కవి మహాదేవి చెన్నమ్మ అనిత మహేశ్వరి,అరుణశ్వేతా, లక్ష్మి, రవి,రాజ లింగం, లక్ష్మయ్య, సుభాష్. కవిత ఏఐటియుసి తదితరులు పాల్గొన్నారు.