Monday, April 21, 2025
spot_img

రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి

-పాత నేరస్తులు,రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి

-నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి

అక్షర విజేత పెబ్బేర్

ఈ రోజు జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల సంఘం సూచనల ప్రకారం బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలియజేసారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక వ్యక్తుల,రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో భరోసా కల్పించే విధంగా పనిచేయాలని తెలిపారు.గంజాయి అక్రమ రవాణా,క్రికెట్ బెట్టింగులు, జూదం,మట్కా అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్రమ మధ్యము,నగదు రవాణాను నిరోధించడంలో భాగంగా చెక్ పోస్ట్ లలో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా పరిమితికి మించి నగదును రవాణా చేస్తూ పట్టుబడితే ఎన్నికల నియమావళి ప్రకారం కేసుల నమోదు చేయాలని తెలిపారు.ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ప్రభుత్వ నిషేధిత గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.దొంగతనం కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి,భాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేసినప్పుడు సైబర్ నేరగాళ్ళ ఖాతాలలో ఉన్న నగదును పుట్ ఆన్ హోల్డ్ లో ఉంచడమైనదని అన్నారు.అట్టి నగదును కోర్టు ద్వారా కొన్ని మార్గనిర్దేశాలతో భాదితులకు అందజేయడం జరిగితుందని తెలిపారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్),వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు.ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మద్యం సేవించి వాహనాలను నడుపుతూ,ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీ రామదాసు తేజావత్ ,డిఎస్పీ శ్రీ J. వేంకటేశ్వరరావు , డి సి ఆర్ బి డిఎస్పీ శ్రీ కృష కిశోర్, జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సిఐలు,జిల్లా ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles