పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రిలలో ఆకస్మిక తనిఖీ
అనుమతి లేని హాస్పిటల్స్ కు నోటీసులు జారీ చేసిన డిఎం అండ్ హెచ్ఓ
అక్షరవిజేత మహబూబాబాద్
వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి కళావతి భాయి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని మైత్రి హాస్పిటల్,లక్ష్మీ హాస్పిటల్,చిన్నారి పిల్లల హాస్పిటల్,మన్మోహన్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇందులో భాగంగా స్కానింగ్ సెంటర్లలలో లింగ నిర్ధారణ పరీక్షలు అనుమతి పొందిన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్ట్లుమాత్రమే గర్భవతులకు స్కానింగ్ చేయాలని లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఆడ మగ చట్టరీత్యా నేరమని వివరించడం జరిగింది.అన్ని స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ చేసే గదిలో వేచియుండు హాలులో తప్పకుండా ఇక్కడ లింగ నిర్ధారణ చెప్పబడదు అనే బోర్డు పెట్టాల్సిందిగా ఆదేశించారు.ఫామ్ ఎఫ్ రోజువారి ఆన్లైన్ చేయాలని,ఆన్లైన్ చేసిన అన్ని ఫారం-ఎఫ్ లు అన్నీ ప్రతినెల5వతేదీ లోపు కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు.అలాగే ప్రతి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు దరల పట్టికను ప్రదర్శించాలని పేర్కొన్నారు.పట్టణంలో అనుమతి లేని చిన్నారి పిల్లల హాస్పిటల్ మన్మోహన్ రెడ్డి మల్టీస్పెషాల్టి హాస్పిటల్ లను గుర్తించి అనుమతి లేనందుకుగాను నోటీసులు ఇవ్వడం జరిగిందని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో సిహెచ్ బిందుశ్రీ,మాతా శిశు సంరక్షణ అధికారి,కొప్పు ప్రసాద్,ఆరోగ్య విద్యా బోధకులు బి మహేందర్ రెడ్డి,పి హెచ్ ఎన్ కావేటి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.