Sunday, April 20, 2025
spot_img

ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం

ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా. కళాకారుడు గుంటి పిచ్చయ్య ను ఘనంగా సన్మానించిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి. ….

అక్షర విజేత  మునగాల

నేడు మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో. ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా. మఠంపల్లి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చెందిన. ప్రభుత్వ విద్యుత్ ఉధ్యోగి ప్రముఖ రంగస్థల కళాకారుడు డాక్టర్ గుంటి పిచ్చయ్య ను గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో శాలువతో సత్కరించి. మెమోంటో బహుకరించి . పుష్పగుచ్చం అందించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ. ఒకపక్క ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగిగా. ( లైన్ ఇన్స్పెక్టర్ )విదులు నిర్వహిస్తూ నటనపై మక్కువతో. ఎన్నో వందల నాటక. ప్రదర్శనలు చేసి. ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని లిమ్కా బుక్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ గుంటి పిచ్చయ్యను. నేడు ఇలా సన్మానించుకోవడం సంతోషాన్నిచ్చిందని. అలాగే ప్రస్తుతం సమాజంలో. రంగస్థల కళాకారులకు. సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరమని. పలు అంశాలలో. వివిధ సందర్భాలలో అంటరానితనం. కుల వివక్ష సామాజిక రుగ్మతలపై. మలిదశ తెలంగాణ ఉద్యమంలో. కరోనా లాంటి విపత్కర సమయాలలో. తమ నటనలతో. అలరించి సందేశాత్మకమైన. సందేశాలు అందించి ప్రజలను చైతన్యపరిచి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి‌ సకల జనులను కార్మోకులను చేయడంలో వివిద రూపాలలో ‌ వివిధ సందర్భాలలో. సందర్భానుసారం. వివిధ వేషధారణలతో. జాతిని జాగృతం చేస్తున్న. కళాకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అంతరించిపోతున్న రంగస్థలం కళాకారులకు ఒక ప్రత్యేక గుర్తింపుని ఇచ్చే విధంగా ప్రోత్సహించి వారికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి. నటనని నమ్ముకొని. దుర్భర జీవితం సాగిస్తున్న పేద కళాకారులకు. ఆపన్న హస్తం అందించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో బొమ్మ సైదులు. బుద్ధి సురేష్ కారంగుల ఉపేందర్. బారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles