బీఎస్పీ మండల అధ్యక్షునిగా దుర్గం రాజశేఖర్ ఎన్నిక
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి
తాండూర్ మండలం నీలాయిపల్లి గ్రామంలో నిర్వహించిన బీఎస్పీ మండల కమిటీ సమావేశంలో తాండూర్ కు చెందిన దుర్గం రాజశేఖర్ ను బిఎస్పి మండల అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ట పవన్ కుమార్, జిల్లా ఇన్చార్జి సిరికొండ బోసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ మండల ఉపాధ్యక్షులుగా కోటపాటి సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా బొంతల సాయి తేజను నియమించడం జరిగిందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఎస్పి పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి లోక్ సభకు పంపించాలని వారు కోరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నాయకత్వాన్ని బలపరచాలని బీఎస్పీని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సురేష్, దాసరి పోశం, మేక భీమయ్య తదితరులు పాల్గొన్నారు.