అక్షర విజేత, నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సినీనటి యాంకర్ శ్రీముఖి సందడి చేసింది. బుధవారం నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీనటి, యాంకర్ శ్రీముఖి హాజరు కావడంతో అభిమానులు సెల్ఫీ దిగడానికి పోటెత్తారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నా బాల్యం అంతా ఇందూర్ లో నే గడిచిందని అన్నారు. పుట్టి, పెరిగిన ఈ ఊరిలోనే ఒక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు, మిత్రుల తో కలిసి పాఠశాలకు వెళ్ళిన రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. ఇందూరుతో విడదీయని అనుబంధం ఉందని అన్నారు. తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్ సెల్‌బేని ప్రారంభించారు. వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగ రాజు డైరెక్టర్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్, సుహాస్ , మార్కెటింగ్ డైరెక్టర్ సుదీప్ నల్లచెరు పాల్గొన్నారు