అప్పారి వెంకటస్వామి ఆశయాలను సాధిద్దాం.
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
యూటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి 23వ వర్ధంతి సందర్బంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి డివిజన్ లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గుండారపు చక్రపాణి మాట్లాడుతూ అప్పారి వెంకటస్వామి 18 సంవత్సరాల సర్వీస్ ను త్యాగం చేసి జీవితాన్నంత ఉపాధ్యాయ ఉద్యమానికి అంకితం చేశారన్నారు. సమయపాలన లో ఆర్ధిక క్రమశిక్షణలో, ఉపాధ్యాయుల సమస్యల పోరాటంలో వారు నేటి తరానికి ఆదర్శప్రాయులు అని అన్నారు. రీగ్రూప్ స్కేల్స్ సాధనలో, ఉపాధ్యాయులకు సెలవులు సాధించడంలో, ప్రతి ఫలితంలో అప్పారి కనిపిస్తారన్నారు. ఉపాధ్యాయుల ఉద్యమంను, సంఘంను బలోపేతం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరం పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. దేవదాస్, వివిధ మండలాల బాధ్యులు చక్రవర్తి, రమేష్, సుధాకర్, చంద్రశేఖర్, రాజేష్, రామకృష్ణ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.