ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి
ప్రచార అనుమతులు నిర్దేశిత సమయంలో అందజేయాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
అక్షర విజేత శ్రీకాకుళం,ప్రతినిధి
ఎన్నికల ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలని, అన్ని ప్రచార అనుమతులు నిర్దేశిత సమయంలో అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి బుధవారం సీ-విజిల్ యాప్, ఈఎస్ఎంఎస్ ఫిర్యాదులు, ఎంసిసి, ఫిర్యాదుల పరిష్కారం, ఎన్నికల సన్నద్ధత, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ఫార్మ్ -7 & 8 ల పరిష్కారం, రాజకీయ పార్టీలకు అనుమతుల జారిని వేగవంతం చేయడం, సి-విజిల్ ద్వారా అందే ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేరుగా గానీ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా గానీ అందే ధరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఎంతో అప్రమ్తతంగా ఉండాలని, ఎటు వంటి దుర్ఝటనలకు తావులేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్ఓలు భరత్ నాయక్, దొర, సిహెచ్.రంగయ్య, లక్ష్మణ మూర్తి, అప్పారావు, రామ్మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతి రావు, సిహెచ్.రంగయ్య, డిఅర్డిఏ పీడీ కిరణ్ కుమార్, ఐసిడిఎస్ పీడీ బి.శాంతిశ్రీ, జీఎస్టి జాయింట్ కమిషనర్ నాగార్జున రావు, అసిస్టెంట్ కమిషనర్ రాణీ మోహన్, సిపిఓ ప్రసన్న లక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్య కిరణ్, డిటిసి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఆడిట్ అధికారి సుల్తానా, సెబ్ అధికారి తిరుపతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావు, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ చంద్రరావు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్న కేశవరావు తదితరులు హాజరయ్యారు.