*విజయలక్ష్మి హాస్పిటల్ లో దారుణం.*
*వాట్సప్ వీడియో కాల్ ద్వారా వైద్యం నవజాత కవలపిల్లలు మృతి.
*హాస్పిటల్ ఫీజు 30 వేలు కట్టి వెళ్లాలని యాజమాన్యం డిమాండ్.*
*హాస్పిటల్ పై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి హాస్పిటల్ లో దారుణం సంఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని మంచాల రోడ్డులో గల విజయలక్ష్మి హాస్పిటల్ లో కాన్పు కోసం వచ్చిన పేషెంట్ కు అందుబాటులో లేని డాక్టర్ వాట్సప్ వీడియో కాల్ ద్వారా సిస్టర్ వైద్యం చేయడంతో వైద్యం వికటించి కవలపిల్లలు మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్ కీర్తి దంపతులకు 6 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ రావడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్ చూపించడం జరిగింది. ఆదివారం ఉదయం 4 గంటలకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి పేషెంట్ ను తీసుకువచ్చామని భర్త గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చిందినట్లు తెలిపారు. ఉదయం 4 గంటలకు డాక్టర్ కు సమాచారం ఇస్తే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సిస్టర్ రాజ్యలక్ష్మి కి చూచించడంతో సిస్టర్ వైద్యం చేయడం జరిగింది. వైద్యం వికటించి పిల్లల చనిపోయిన తర్వాత 11 గంటలకు డాక్టర్ వచ్చారని పిల్లలు చనిపోయిన కూడా 30 వేలు ఆస్పత్రి ఫీజు కట్టాలని ఆస్పత్రి యజమాన్యం తెలపడం బాధాకరంగా ఉందని, ఈ ఆస్పత్రిలో కనీస వస్తువులు కూడా లేవని ఇలాంటి సంఘటన మరెవరికి జరగకుండా ఆస్పత్రి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.