బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి
*అక్షర విజేత మహేశ్వరం*
సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూత నందిస్తున్నాయని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.నియోజకవర్గంలో పలువురికి సీఎంర్ఫ్ చెక్కులను తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కేఎల్ఆర్, అందజేశారు.ఈ సందర్భంగా కిచ్చెన్న మాట్లాడుతూ… అనారోగ్యంతో ఆస్పత్రి పాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొంత స్వాంతన పేద కుటుంబాలకు కలుగుతుందని లక్ష్మారెడ్డి చెప్పారు.ముందు నుంచే ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ శ్రద్ధ పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రోకర్ వ్యవస్థ లేకుండా నేరుగా పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా రోగుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని కేఎల్ఆర్, అన్నారు.పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత రోగులందరికీ, మానవతాధృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్ అందిస్తుందని కిచ్చెన్నగారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, అన్ని సెల్ ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.