*తుమ్మలూరు గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం*
*అక్షర విజేత మహేశ్వరం*
మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గేట్ సమీపంలో భారీ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది.హైదరాబాద్ వాస్తవ్యులు సోమశిల గుడికి వెళ్లి తిరుగు పయణంలో హైదరాబాద్ కి వస్తుండగా తుమ్మలూరు గేట్ వద్ద ఎదురుగా వస్తున్న కల్వకుర్తి బస్సును ప్రవేట్ బస్సు డికొనడంతో 15 మంది వరకు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు బస్సు డ్రైవర్లకి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్ కి తరలించారు.శ్రీశైలం హైవే పైన సుమారు రాత్రి 8.00 గంటల సమయంలో ఈ ఆక్సిడెంట్ జరగటం వలన దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఈ ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని నియంత్రణ చేసారు.