*కోళ్ల పడకల్ గ్రామంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన సీఐ వెంకటేశ్వర్లు*
*అక్షర విజేత మహేశ్వరం*
మహేశ్వరం మండల పరిధిలోని కోళ్లపడకల్ గ్రామం లో నిర్వహించిన కె పి ఎల్ ప్రీమియర్ లీగ్ సీసన్ -9 ను టాస్ వేసి ప్రారంభించిన, మహేశ్వరం సీఐ. హెచ్. వెంకటేశ్వర్లు ఈసందర్బంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ని యువత జీవితంలో అట ఒక భాగం, ఇవి ఆటలు, వినోదాలు మరియు శారీరక వ్యాయామం ద్వారా వారిని ఆనందపరుస్తాయి. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడడానికి మరియు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను పెంచడానికి దోహదం చేస్తాయి అని అన్నారు. కేపీఎల్ ప్రీమియర్ లీగ్ ఆల్ టీం స్పాన్సర్ లక్ష యాభై వేల రూపాయలు మేనేజ్ మెంట్ కు అందచేశారు. కె.రాజేష్ గౌడ్ ను శాలువా తో సన్మానించి, ఆల్ టీమ్ లకు అభినందనలు తెలిపిన మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఎస్ ఐ. ప్రసాద్, నందిగామ నర్సింహా,హన్మగల చంద్రయ్య, నందిగామ యాదయ్య, ఐ.నర్సింహా గౌడ్, ఆవుల కుమార్, ఆవుల మల్లేష్, సి హెచ్. ప్రవీణ్,కె శేఖర్,ఎస్. భాస్కర్ గౌడ్,అనంత రెడ్డి, రఘుపతి,బండ బిక్షపతి, క్రీడాకారులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.