అక్షర విజేత కథనానికి స్పందన
సిసిఎస్ పోలీస్ బృందం రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టివేత
అక్షర విజేత వీపనగండ్ల:
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని తూముకుంట వాగు నుండి ప్రభుత్వం సెలవు ఉన్న అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చిన్నంబావి మండల కేంద్రానికి తరలిస్తుండగా చిన్నదగడ సమీపంలో సిసిఎస్ పోలీస్ బృందం రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. చిన్నంబావి పోలీస్ స్టేషన్ కు ఇసుక ట్రాక్టర్లను తరలించారు.ఈ సందర్భంగా సిసిఎస్ పోలీసు బృందం మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాక్టర్ యజమానులకు హెచ్చరించారు.