*ఉగ్రవాదం నిర్మూలించాలి:సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి.వీరశేఖర్*
అక్షరవిజేత,బద్వేల్/నెల్లూరు బ్యూరో :
జమ్మూ కశ్మీర్ లో భారత పర్యాటకుల పై ఉగ్రవాదుల పాశవిక దాడిని ఖండిస్తూ బద్వేల్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీరశేఖర్ మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ మంగళవారం జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని పహాల్గం లో మన భారతదేశ పర్యాటకుల పై ఉగ్రవాదులు తుపాకీ తూటాలు వర్షం కురిపించి దాడి చేసి నరమెదాన్ని సృష్టించారని
ఈ ముస్కర్లకు దీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల కుటుంబీకులకు తగిన నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్ ఇటీవల ఆర్థిక అభివృద్ధి దిశగా పయనిస్తూ అభివృద్ధి చెందుతున్న ఈ దశ లో అక్కసుతో ఉగ్రవాదులు కుట్రపూరితంగా దాడులు చేస్తూ నరమేధం సృష్టించారని ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా వెంటనే ఉగ్రవాదులను గుర్తించి ఉరి శిక్ష విధించాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పి. బాలు. నాగ సుబ్బయ్య. వెంకటేష్. పొంగూరు నాగరాజు. పడిగే వెంకటరమణ. రామసుబ్బారెడ్డి. చేజర్ల రవి. తదితరులు పాల్గొన్నారు.