పక్క ప్రభుత్వ సెలవు… పట్టుకునే అధికారి ఎవరు..??
రూట్ మార్చిన ఇసక మాఫియా..!!
ఇందిరమ్మ ఇండ్ల నమూనా పేరుతో అక్రమ ఇసుక రవాణా..??
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ట్రాక్టర్ యజమానులు..!!
నిబంధనలకు పాతార… కొనసాగుతున్న ఇసుక జాతర..!!
అక్షరవిజేత వీపనగండ్ల:
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పరిధిలోని తూముకుంట గ్రామం వాగు నుండి ప్రభుత్వ సెలవులో అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా దందా మూడు పూలు ఆరు కాయలుగా ఇసుక సాఫీగా సాగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల నమూనా పేరు మీద వివిధ గ్రామాలకు ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ యజమానులు ఇసుక రవాణా చేస్తున్నారు.గత 15-20 రోజుల నుండి తూముకుంట వాగు నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తూ రోజుకు నాలుగు నుండి ఐదు ట్రిప్పులు వివిధ గ్రామాలకు తరలిస్తున్నారని తుముకుంట గ్రామ ప్రజలు అంటున్నారు.ఇసుక ట్రాక్టర్ వేగానికి వాహనాదారులు భయాందోళనకు గురి చెందుతున్నామని ప్రజలు వాపోతున్నారు.ఎన్ని దాడులు చేసిన అక్రమ ఇసుక దందా ఆగడం లేదు..!!అని మండల కేంద్రంలో ప్రజల నోట భారీ ఎత్తున ప్రచారం సాగుతుంది.కాబట్టి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.