కొండగట్టు పుణ్యక్షేత్రంలో ప్రసాద తయారీలో నాసిరకం వస్తువులు
ప్రజావాణిలో ఫిర్యాదు
అక్షర విజేత మల్యాల కొండగట్టు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో భక్తులు అందించే పులిహోర లడ్డు అన్నప్రసాదాలలో నాసీ రకం వస్తువులు వాడుతున్నారని ఆలయ మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు పోచంపల్లి ప్రవీణ్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.పులిహోర కోసం పాత సన్న రకం బియ్యం ఉండగా స్టీమ్ బియ్యాన్ని మరియు పులిహోర లడ్డు తయారీలో వాడే సరుకులు నాసిరకం వస్తువులను కాంట్రాక్టర్ సరఫరా చేస్తుండగా ఆలయ అధికారులు ఎలాంటి అభ్యంతరం తెలపడం లేదని ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని తగు చర్యలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరాడు.