*మెగా డీమార్ట్ లో దారుణం.*
*చాక్లెట్ తిన్నాడన్న అక్కాసుతో బాలుడిని రూమ్ లో బంధించి చితకబాదిన యజమాని.*
*జువైనల్ జస్టిస్ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మెగా డీమార్టులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలియక చేసిన తప్పుకు నరకం చూపిన యాజమాన్యం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మంచాల రోడ్ లో ఉన్న మెగా డీమార్ట్ లోకి వచ్చిన ఓ బాలుడు చాక్లెట్ తిన్నాడన్న అక్కాసుతో మెగా డీమార్ట్ యజమాని ఆ బాలుడిని చితకబాదినట్లు తెలిపారు. అంతే కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మెగా డిమార్ట్ యాజమాన్యం, బాలుడిని రూమ్ లో నిర్బంధించారు. మంచాల మండలం నోముల బీసీ హాస్టల్ లో చదువుతున్న బాలుడు తెలిసి తెలియక చేసిన చిన్న తప్పుకు రూమ్ లో మెగా డి మార్ట్ యజమాన్యం ముజాహిర్, బషీర్, చింటూ, సమీర్, రాకేష్ లు బంధించి చిత్రహింసలు పెట్టారు.స్థానికుల సమాచారంతో కదిలిన పోలీస్ యంత్రాంగం బాలుడిని చిత్ర హింసలకు గురిచేసిన మెగా డీమార్ట్ యాజమాన్యంపై హాస్టల్ డిప్యూటీ వార్డెన్ జె.మధు ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు జువైనల్ జస్టిస్ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెగా డీమార్ట్ ని వెంటనే మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.