*డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు*
అక్షర విజేత నారాయణపేట జిల్లా/ఊట్కూరు
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఊట్కూరు మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మూడవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొక్కు శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి గొప్ప మేధావి యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని, అంబేద్కర్ చిన్నతనం నుండి ఏ విధంగా కుల వివక్షతకు గురయ్యాడు అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని తెలపడం జరిగింది. భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క జీవిత లక్ష్యాలను మరియు వారి యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని ప్రతి పాఠశాల అంటూ 80 మంది విద్యార్థులు వ్యాసరచన ఉపన్యాస పోటీలలో పాల్గొనడం జరిగింది. విజేతలగా నిలిచిన విద్యార్థులకు అంబేద్కర్ జయంతి అయినటువంటి ఏప్రిల్ 14న బహుమతులు అందిస్తామని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి కొండను భరత్ , k.నారాయణ , కొండన్ గోపాల్ ,R.దశరథ్ కొక్కు. నర్సింలు,k. నారాయణ, రంగమొల్ల.రాజ్ కుమార్,బక్కి. తిమ్మప్ప, నితీష్,శంకర్. తదిత యువకులు పాల్గొన్నారు…