అధికార పార్టీ ముసుగులో భూకబ్జాలు
నకిలీ పట్టాలతో అమాయకులకు టోకరా
మద్యం వ్యాపారం చేసే వ్యక్తి సైతం భూ వ్యాపారం
నకిలీ పట్టాల తయారీదారులపై ద్రుష్టిసారించని పోలీసులు
భూ అక్రమార్కులపై పోలీసు చర్యలు ఉంటాయా?
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : అధికార పార్టీ ముసుగులో నకిలీ పట్టాలను స్రుష్టించి అమాయక ప్రజలజీవితాలతో ఆడుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం వివిధ వర్గాలకుఇచ్చిన భూములను కబ్జాలు చేసి వాటిని ఇతరులకు అమ్ముతున్నారు. ఈ తతంతంగంజిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా నడుస్తున్న జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు ద్రుష్టి సారించకపోవడంతో వీరి ఆటలు యధేచ్చగా సాగుతున్నాయి. నకిలీ పట్టాలను తయారుచేసే వారిపై జిల్లా యంత్రతాంగం చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈ నకిలీ పట్టాల ద్వారా అమాయక ప్రజలు బలవుతున్నా వీరి దౌర్జన్యాలను ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లడానికి జంకుతున్నారు. జిల్లా కేంద్ర శివారులో గతంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూములేగాక ప్రభుత్వ అసైన్డ్ భూమ లనుసైతం కొందరు అక్రమార్కులు కబ్జాలు చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపనలు వస్తున్నాయి. అమాయకులు కొనుగోలు చేసిన భూముల్లో నిర్మాణాలు చేసుకోవడానికి సిద్దం కావడంతో ఈ విషయాలు వెలుగులోకి వస్స్తున్నాయి. ధర్మపురి హిల్స్ కు చెందిన ఓ పేద మహిళ వీరి ఉచ్చులో పడి మోసపోయిన ఘటన జరిగింది. ఆ మహిళ అక్రమార్కుల నుంచి 2లక్షల 80 వేలకు కొనుగోలు చేసి ఆ స్థలంలో బోరు వేస్తుండగా అసలు స్థలానికి చెందిన యజమాని అక్కడికి చేరుకుని ఆమె చేస్తున్న పనులుఅడ్డగించారు. సదరు మహిళ లబోదిబో మంటూ అక్రమార్కుల చుట్టూ తిరిగినా అమెకు న్యాయం జరగడంలేదు. తాను ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని సదరు వ్యక్తిని కోరగా అతను వాయిదాలు పెడుతూ దాటవేస్తున్నాడని ఆమె వాపోయింది. ఈ విషయం ఎక్కడైనా చెప్పుకుంటే ఎవరు తమను ఏమి చేయరని , తమకు అధికార పార్టీ నేత అండదండలు ఉన్నాయని బెదిరిస్తున్నాడని ఆమె పేర్కొంది. జిల్లా కేంద్రంలోని అర్సపల్లి ప్రాంత శివారులో పాఠశాల సమీపంలోని శిఖం భూములను సైతం కబ్జాలు చేసి విక్రయిస్తున్నా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు ఆ దిశగా ద్రుష్టిసారించకపోవడం గమనార్హం. వీరు గతంలో అసైన్డ్, శిఖం భూములను కబ్జాలు చేసి అమాయక పేద ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపనలు ఉన్నాయి. వీరిపై గతంలో అనేక కేసులు ఉన్నప్పటికీ తిరిగి వీరు ఎక్కడ భూములు కనిపించినా వాటిని కబ్జా చేయడం పరిపాటిగామారింది. భూకబ్జాలు చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో సదరువ్యక్తి గతంలో మద్యాన్ని అమ్మే వ్యాపారం చేసేవాడని, అయితే గత కొంతకాలంగా మద్యం అమ్మకాలకు స్వస్తి పలికి భూముల అమ్మకాలు మొదలు పెట్టాడు. గతంలో సదరు వ్యక్తిపై మద్యం కేసులు సైతం ఉన్నాయి. వాటినుంచి తప్పించుకోవడానికి భూముల కబ్జాలు చేస్తూ అమ్మడం చేస్తున్నాడు. అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని మోసాలకుగుచి చేస్తున్న సదరు వ్యక్తిపై సంబంధిత శాఖ అధికారులు ద్రుష్టిసారించి చర్యలు తీసుకోవలసిందిగా పలువురు కోరుతున్నారు.