పాతకక్షలతో యువకుడిపై కత్తితో దాడి
తీవ్ర గాయలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి :
పాతకక్షలను మనసులో పెట్టుకుని ఓ యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపింది. నగరంలోని 6వ టౌన్ పరిధిలో బోధన్ రోడ్డులో గల నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలో బుధవారం సాయంత్రం షేక్ గౌస్ అనే వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. కూలీ పని చేసే చోట యువకులకు మధ్య విభేదాలు ఉండగా అవి పాతకక్షలకు దారి తీసాయి. ఈ నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడి చేయగా మూడు చోట్ల కత్తిపోట్లు దిగాయి. ఈ ఘటనలో షేక్ గౌస్ కడుపులోని పేగులు బయటకు వచ్చాయి. హుటాహుటిన గౌస్ ను నిజామాబాద్ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రంజాన్ పండగ రోజు ఓ యువకుడు కత్తితో నగరంలోని 1వ టౌన్ పరిధిలో వీరంగం చేశారు. ఈ ఘటన మరువకముందే రెండవ రోజే ఇలాంటి ఘటన జరుగడంతో మళ్ళీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.