కాంగ్రెస్ పార్టీలో నేతల కొరత
. . . ఏళ్లుగా కొందరికే అవకాశాలు
. . . ద్వితీయ శ్రేణులను పట్టించుకోని రాష్ట్ర నాయకత్వం
. . . పార్టీ బలోపేతానికి ఆసక్తిచూపని కార్యకర్తలు
. . . 15 ఏళ్లుగా జిల్లాలో నామమాత్రంగానే పార్టీ కార్యకలాపాలు
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి :
జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత వర్గపోరు వల్ల కొత్తవారికి పదవులు కట్టబెట్టే అవకాశాలు లేకపోవడంతో పార్టీలో కొనసాగుతున్న ద్వితీయ శ్రేణినేతలు, కార్యకర్తలు కేవలం కాంగ్రెస్ పార్టీ పేరుచెప్పుకుని కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లా, నగర అధ్యక్షులుగా మార్చకుండానే ఏళ్లతరబడి వారినే కొనసాగించడంవల్ల పార్టీ కార్యకలాపాల్లో కేడర్ ఉత్సాహంగా పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదని పార్టీలో చర్చనీయాంశంగామారింది. పార్టీ బలోపేతానికి ద్వతీయశ్రేణి నేతలు,పార్టీ కార్యకర్తలు ఆసక్తి చూపకపోవడంతో గత 15 ఏళ్లుగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలవలేనిపరిస్థతి నెలకొంది. ఎంపిగా మధుయాష్కీగౌడ్ రెండు పర్యాయాలు ఎంపిగా గెలుపొందినా పార్టీని ప్రజల్లో తీసుకెళ్లలేకపోయారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత గెలుపొందారు. అనంతరం 2018, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన ధర్మపురి అరవింద్ గెలుపొందారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న అసెంబ్లీ, కార్పొరేషన్, మున్సిపాలిటీల,జిల్లా పరిషత్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలను ఒకేతాటిపైకి తీసుకువచ్చి పార్టీ అభివ్రుద్దికి, అభ్యర్థుల గెలుపుపై ధ్రుష్టి సారించలేకపోయింది. జిల్లలో పార్టీ అభ్యర్థులు వరుసగా ఓటమిపాలవుతున్న ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా కొత్తవారికి సముచిత బాధయతలు అప్పగించకపోవడంతో ప్రతీరోజు కలకలలాడాల్సిన జిల్లా పార్టీ కార్యాలయం కేడర్ వెలవెలబోతోంది. పార్టీ ముఖ్య నేతలు వచ్చిన సమయంలోనే కొందరు మాత్రమే పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందడానికి కాంగ్రెస్ పార్టీతో పోటీపడే ఇతర రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే గెలుపు దిశగా అడగులువేస్తూ క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి సిద్ధమవతున్నారు. కాంగ్గెస్ పార్టీ కేడర్ మాత్రం ప్రభుత్వ పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపడంలేదు. కాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తవారికి అవకాశాలు కల్పించకుండా ఉన్నవారికే జంట పదవులు కట్టబెట్టడానికి ఆ పార్టీకి నేతల కొరత తీవ్రంగా ఉన్నట్లుగా ప్రజల్లోకి సంకేతాలు వెలుతున్నాయి.