సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి
అక్షర విజేత వీపనగండ్ల:
వీపనగండ్ల మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులకు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతుల వెంకట్ రెడ్డి, సమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి, బస్పరాజు గౌడ్, పుట్ట భరత్,ముదిగొండ గోపి, కావలి మహేష్, ఎత్తం వెంకటేష్, సప్లయర్ బాల పీర్, సంగ్యం వెంకటయ్య, జానీ, తదితరులు కలిసి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సీఎం సహాయ నిధులు ఎంతగానో దోహదపడుతుందని వారు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.