రైతులకు శుభవార్త.. సబ్ స్టేషన్ ఆపరేటర్లకు చారవాణి ఏర్పాటు కల్పించిన ఏఈ భగవంతు నాయక్
అక్షర విజేత వీపనగండ్ల:
వీపనగండ్ల మండల కేంద్రంలో గత 5 సం”రాల నుండి సబ్ స్టేషన్ లో చరవాణి లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యోగంలో ఏ ఆపరేటర్ ఉన్నాడో… తెలుసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతులకు..విద్యుత్ ఎఈ భగవంతు నాయక్ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని గ్రహించి సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా ఎవరు పని చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇబ్బంది పడకుండా రైతుల కోసం చారవాణిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇబ్బంది ఎదురుకోకుండా 9502019905 గల నెంబర్ కు ఫోన్ చేసి విద్యుత్ అవసరాల కోసం వాడుకోగలరని ఏఈ భగవంతు నాయక్ తెలిపారు. సబ్ స్టేషన్ లో చారవాణిని ఏర్పాటు చేసినందుకు విద్యుత్ ఏఈకి రైతులు,గ్రామ ప్రజలు,వివిధ గ్రామాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.