*యేసు క్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలి*
*పాస్టర్ మామిడి శ్యాంసన్*
అక్షర విజేత సూర్యాపేట ప్రతినిధి
ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని పాస్టర్ మామిడి శాంసన్ అన్నారు. ఆదివారం సువెన్ ఫార్మా కంపెనీ సమీపంలో న్యూ లైఫ్ మినిస్ట్రీస్ చర్చిలో ఈస్టర్ పర్వదినం సందర్భంగా పాస్టర్ మామిడి శ్యాంసన్ మాట్లాడుతూ. యేసు క్రీస్తు శిలువ మరణాన్ని పొంది మానవాళి పాపాల్ని క్షమించడాని కే భూమిపై మళ్లీ అవతరించారని పేర్కొన్నారు. లోక కళ్యాణం కోసం ప్రభువైన యేసు మళ్లీ వచ్చిన రోజు ఇవాళ్టి ఈస్టర్ పర్వదినమని అన్నారు. ప్రేమ,సహనం,శాంతిని పంచిన కరుణామయుడు క్రీస్తు అని, ఆయన ప్రేమస్వరూపుడని పేర్కొన్నారు. మానవుల పాప పరిహారార్థం భూలోకానికి దేవ దేవుడు వచ్చి లోక కళ్యాణార్థం గా పాపము లేని ఏకైక సత్యదేవుడైన ఏసుక్రీస్తు మాత్రమే చనిపోయి తిరిగి లేచినారు అని అన్నారు. అంతిమంగా భగవంతుడు ఒక్కడేనని, ఒకరిపట్ల ఒకరు ప్రేమతో, దయాగుణం తో వ్యవహరించాలని అన్నారు. అనంతరం కోలాటాల తో 40 మంది విద్యార్థినిలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్త క్రైస్తవ సోదరులకు ఆయన ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ అమ్మ, రంజిత్, రజిత, పౌల్, రాజు, యేసు పాదం, విజయ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.