బసవేశ్వర విగ్రహా ఏర్పాటుకు స్థలం కేటాయించండి
బషీరాబాద్ ఎమ్మార్వో వినతి పత్రం అందించిన వీరశైవ సమాజం
అక్షరవిజేత, తాండూరు :
శ్రీ సద్గురు బసవేశ్వర విగ్రహాన్ని ప్రతిష్టాపన కు స్థలం కేటాయించాలని వీరశైవసమాజం ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్వో వై, వెంకటేశం కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ సద్గురు బసవేశ్వర విగ్రహాన్ని ప్రతిష్టాపన కు స్థలం మండల కేంద్రంలోని సర్వే నంబర్ 61 రైతు వేదిక పక్కన అనువైన ప్రదేశంగా వీరశైవుల అందరము కలిసి భావించాము కావున ఆ స్థలాన్ని శ్రీ సద్గురు బసవేశ్వర విగ్రహా ఏర్పాటుకు కేటాయించాలని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల వీరశైవ సమాజం పెద్దలు పి, చరణ్ కుమార్ స్వామి. జే, రాజశేఖర్ స్వామి. ఎస్, జగదీశ్వర్ టి, రమేష్ ఎం, జగదీశ్వరయ్య స్వామి మాజీ, ఎంపిటిసి,సి, మల్లికార్జున్ మాజీ, ఎంపిటిసి,ఎం, నాగేంద్ర స్వామి, మంతయ్య స్వామి, ఆడికి రవిశంకర్, శాంతయ్య, ఎం,సంగయ్య స్వామి స్థలాన్ని మా వీరశైవకులకు కేటాయాల్సిందిగా సమాజం తరఫున పెద్దలను విజ్ఞప్తి చేశారు