*అమరచింత ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి*
*సగం కాన్పు చేసి ఆత్మకూర్ ఆసుపత్రికి తరలించిన వైనం.*
*ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన వైనం*
*ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లిని కాపాడే ప్రయత్నంలో పసిబిడ్డ తలకోసిన వైనం.*
*ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ ఆసుపత్రిలో తీరు మారడం లేదు..*
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ లేక సిబ్బంది నిర్లక్ష్యంతో పసిక్కందు మృతి చెందిన సంఘటన అమరచింత ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే అమరచింత మండలం చంద్రగట్టు గ్రామానికి చెందిన మహిళ పురిటీ నొప్పులతో ప్రసవ కొరకు సోమవారం మధ్యరాత్రి అమరచింత ప్రభుత్వ ఆసుపత్రికి డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంతో సాధారణ డెలివరీ చేసేందుకు ప్రయత్నించిన సిబ్బంది ప్రసవ సమయంలో బిడ్డ ఎంత ప్రయత్నించినా బిడ్డ తల బయటికి రాకపోవడంతో అమరచింత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది సగం కాన్పుతో చేసేది లేక ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సగం కాన్పు తో వచ్చిన బాలింతను కాపాడు ప్రయత్నంలో విఫలమైన సిబ్బంది డాక్టర్లు ఆత్మకూరు ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు ఆత్మకూరు ప్రైవేట్ ఆస్పత్రిలో పరిస్థితి విషమించడంతో తల్లిని కాపాడే ప్రయత్నంలో పసిక్కందు తల కోసి పసికందున బయటకు తీశారని బంధువులు ఆరోపించారు..