*అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బైకిస్ట్..*
*స్పాట్ లో అమ్మాయి, ఆసుపత్రికి తరలిస్తుండగా అబ్బాయి మృతి.*
అక్షరవిజేత,మర్రిపాడు/నెల్లూరు బ్యూరో :
మర్రిపాడు మండల పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయరహదారి కడప సరిహద్దు సమీపంలో కదిరినాయుడు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఝాన్సీ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. నరసింహులు అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన మళ్లీ నరసింహులు బద్వేల్ మున్సిపాలిటీలోని గోపవరం పేటకు చెందిన ఝాన్సీ నెల్లూరు జిల్లాలోని దైవ క్షేత్రమైన పెంచలకోన వెళ్లి తిరిగి వారి స్వగ్రామాలకు వెళుతుండగా వారరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడం జరిగి మృతి చెందడం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కాసుల శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగించారు.