రోజురోజుకు పరిశుభ్రత లోపిస్తున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం..??
అటెండర్ ఉన్నప్పటికీ పరిశుభ్రత లోపం..!!
అధికారుల లోపమే… అటెండర్ పనిచేయని లోపం..!!
అక్షర విజేత వీపనగండ్ల:
వీపనగండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రోజురోజుకు పరిశుభ్రత లోపిస్తుంది. అటెండర్ ఉన్నప్పటికీ కార్యాలయంలో పరిశుభ్రత లేక వాలిన దుమ్ము గోడలపై, మెట్లపై, బండలపై ప్రజలకు దర్శనమిస్తుంది.9 గంటలకు వచ్చినటువంటి అటెండర్ కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచకుండా కేవలం కుర్చీలను,టేబుల్లను మాత్రమే శుభ్రం చేసి వదిలేస్తున్నాడు.
మండల పరిషత్ కార్యాలయానికి వచ్చినటువంటి ప్రజలు ఇదేంటి ఇలా ఉంది…కార్యాలయం అంటూ వెక్కిరిస్తున్నారు. అధికారుల లోపమే..అటెండర్ పనితీరు ఈ విధంగా ఉందని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. కాబట్టి ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.